Wayanad: వయనాడ్ విషాదం... పార్లమెంట్‌లో అమిత్ షా కీలక ప్రకటన

Centre had warned Kerala about heavy rain and landslides
షార్ట్స్‌లో చూడండి
భారీ వర్షాల నేపథ్యంలో కొండచరియలు విరిగిపడే అవకాశాలు ఉన్నాయని తాము కేరళను ముందే హెచ్చరించామని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలిపారు. ఈ ముప్పు గురించి కేంద్రం జులై 23నే అప్రమత్తం చేసిందన్నారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం పౌరులను సకాలంలో సురక్షిత ప్రాంతాలకు తరలించలేదన్నారు. భారీ వర్షాలు కురవగానే 9 ఎన్డీఆర్ఎఫ్ బృందాలను కేరళకు పంపించినట్లు చెప్పారు. ఈ మేరకు ఆయన పార్లమెంట్‌లో ప్రకటన చేశారు.

180కి చేరిన మృతులు

కొండచరియలు విరిగిన ఘటనలో మృతుల సంఖ్య 180కి చేరింది. వయనాడ్‌లో సహాయక చర్యల్లో ఆర్మీ పోర్టబుల్ బ్రిడ్జిలను వినియోగిస్తోంది. వీటిని రెండో ప్రపంచ యుద్ధ కాలంలో తొలిసారి ఉపయోగించారు. ఈ బ్రిడ్జిలను హెలికాప్టర్ల సహాయంతో తరలించేందుకు వీలుంటుంది. ఢిల్లీ నుంచి 110 అడుగుల బ్రిడ్జిని తీసుకువచ్చారు. మరో 170 అడుగుల వంతెనను తయారు చేయాలని ఆర్మీ భావిస్తోంది.
Go Back to Shorts
Wayanad
Kerala
Amit Shah

More Telugu News