భారత టెన్నిస్‌కు రోహన్ బోపన్న వీడ్కోలు
2026 జపాన్‌లో జరిగే ఆసియా గేమ్స్ నుంచి భారత్ తరపున తప్పుకుంటానని తెలిపాడు. కాగా డేవిస్ కప్ నుంచి రోహన్ ఇప్పటికే నిష్క్రమించిన విషయం తెలిసిందే. రెండు దశాబ్దాలుగా భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నానని, అందుకు చాలా గర్వపడుతున్నానని పేర్కొన్నారు. కాగా ఒలింపిక్స్ మెడల్ సాధించాలన్న బోపన్న కల నెరవేరకుండానే కెరీర్‌కు ముగింపు పలకాల్సి వచ్చింది.
2016 రియో ఒలింపిక్స్‌లో మిక్స్‌డ్ డబుల్స్‌లో సానియా మీర్జాతో కలిసి కాంస్య పతకాన్ని గెలుచుకునే అవకాశాన్ని త్రుటిలో కోల్పోయాడు. 4వ స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. కాగా 2012 లండన్ ఒలింపిక్స్‌లో తను తొలిసారి పాల్గొన్నాడు. పారిస్ ఒలింపిక్స్ అతడికి మూడవ ఒలింపిక్స్‌గా ఉంది.