వచ్చే ఏడాది ఆసియా కప్ కు ఆతిథ్యమివ్వనున్న భారత్
- 2025లో ఆసియా కప్ కు వేదికగా భారత్
- టీ20 ఫార్మాట్ లో పోటీలు
- ఒకే ఒక్కసారి 1990-91లో ఆసియా కప్ కు ఆతిథ్యమిచ్చిన భారత్
కాగా, 1984 నుంచి ఆసియా కప్ టోర్నీ నిర్వహిస్తుండగా... అప్పటి నుంచి ఇప్పటివరకు భారత్ ఒక్కసారి మాత్రమే ఆతిథ్యమిచ్చింది. 1990-91 సీజన్ లో ఆసియా కప్ కు భారత్ వేదికగా నిలిచింది. ఆ టోర్నీలో టీమిండియానే విజేతగా నిలిచింది.
ఇక, 2027 ఆసియా కప్ టోర్నీ ఆతిథ్య హక్కులు బంగ్లాదేశ్ కు కేటాయించారు. అయితే బంగ్లాదేశ్ లో జరిగే ఆసియా కప్ ను వన్డే ఫార్మాట్ లో నిర్వహించనున్నారు.