చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నానిపై హత్యాయత్నం కేసు.. మోహిత్‌రెడ్డి అరెస్ట్‌కు రంగం సిద్ధం
- మే 14న పద్మావతి మహిళా యూనివర్సిటీ వద్ద పులివర్తి నానిపై హత్యాయత్నం
- ఈ కేసులో మోహిత్‌రెడ్డిని తాజాగా 37వ నిందితుడిగా చేర్చిన పోలీసులు
- మోహిత్‌రెడ్డి ముందస్తు బెయిలు పిటిషన్‌పై విచారణ వాయిదా
అప్పట్లో ఎఫ్ఐఆర్‌లో మోహిత్‌రెడ్డి పేరు చేర్చని పోలీసులు ఇటీవల ఆయనను 37వ నిందితుడిగా పేర్కొన్నారు. తాజాగా, ఆయన అరెస్ట్‌కు రంగం సిద్ధం చేశారు. దీంతో మోహిత్‌రెడ్డి ముందస్తు బెయిలు కోసం హైకోర్టును ఆశ్రయించారు. అయితే, బెయిల్ పిటిషన్‌ను స్వీకరించిన కోర్టు విచారణను మాత్రం వాయిదా వేసింది. దీంతో ఆయన అరెస్ట్ తప్పకపోవచ్చని, ఏ క్షణమైనా మోహిత్‌రెడ్డిని అరెస్ట్ చేయవచ్చని తెలుస్తోంది.