Raj Tarun: రాజ్ తరుణ్‌కు నోటీసులు జారీ చేసిన పోలీసులు

Narsingi Police issues to Raj Tharun
షార్ట్స్‌లో చూడండి
సినీ నటుడు రాజ్ తరుణ్‌కు హైదరాబాద్‌లోని నార్సింగి పోలీసులు నోటీసులు జారీ చేశారు. లావణ్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నారు. విచారణలో భాగంగా రాజ్ తరుణ్‌కు ఈరోజు నోటీసులు ఇచ్చారు. ఈ నెల 18వ తేదీలోపు విచారణకు హాజరు కావాలని అందులో పేర్కొన్నారు. కొత్త న్యాయచట్టం బీఎన్ఎస్ఎస్ 45 కింద రాజ్ తరుణ్‌కు నోటీసులు ఇచ్చారు.

రాజ్ తరుణ్ తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేశాడని లావణ్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో అతనిపై నార్సింగి పోలీసులు కేసు నమోదు చేశారు. రాజ్ తరుణ్‌తో పాటు మరో ఇద్దరిపై కేసు నమోదైంది. ఏ 1గా రాజ్ తరుణ్, ఏ2 గా మాల్వి మల్హోత్రా, ఏ3గా మయాంక్ మల్హోత్రని పేర్కొన్నారు. మాల్వీ సోదరుడు తనను చంపేస్తానని బెదిరించాడని లావణ్య పేర్కొంది. వారిపై ఐపీసీ 420, 493, 506 సెక్షన్ల కింద కేసు నమోదైంది.
Go Back to Shorts
Raj Tarun
Tollywood
Lavanya

More Telugu News