10 ఉద్యోగాల కోసం పోటెత్తిన 1800 ఆశావాహులు!
- అభ్యర్థులను ఇంటర్వ్యూలకు ఆహ్వానించిన గుజరాత్‌లోని ఇంజినీరింగ్ సంస్థ
- స్థానికంగా ఓ హోటల్‌లో ఇంటర్వ్యూల ఏర్పాటు
- 10 పోస్టుల కోసం యాడ్ ఇస్తే 1800 మంది అభ్యర్థుల హాజరు
- అభ్యర్థులు పోటెత్తడంతో మెట్లపై ఉన్న రెయిలింగ్ కూలిన వైనం
ఘటనపై కాంగ్రెస్ మండిపడింది. బీజేపీ మోడల్ పాలన కారణంగా గుజరాత్‌లో నిరుద్యోగిత పెచ్చుమీరిపోయిందని ఆగ్రహం వ్యక్తం చేసింది. అయితే, ఘటనకు ఇంజినీరింగ్ కంపెనీయే కారణమని బీజేపీ ఎంపీ మన్‌సుఖ మాండవీయ స్పష్టం చేశారు. ఇంటర్వ్యూలను సరిగా నిర్వహించలేదని ఆరోపించారు. ఘటనపై గుజరాత్ హోం మంత్రి హర్ష్ సంఘవీ కూడా స్పందించారు. వీడియోతో రాష్ట్రాన్ని అప్రతిష్ఠ పాలు చేసే ప్రయత్నం జరుగుతోందని అన్నారు. అనుభవజ్ఞులను ఇంటర్వ్యూలకు పిలిచినట్టు కంపెనీ ప్రకటనలో స్పష్టంగా ఉందని, అలాంటప్పుడు వాళ్లందరూ నిరుద్యోగులని అనడం నిరాధారమని అన్నారు. ఇలాంటి పరిస్థితులు తలెత్తకుండా ఉండేందుకు ఉద్యోగార్హతలకు సంబంధించి పూర్తి సమాచారాన్ని పత్రికాప్రకటనల్లో పేర్కొనాలని సూచించారు.