ప్రతీకారం తీర్చుకుంటాం.. కథువా ఉగ్రదాడిపై భారత సైన్యం రియాక్షన్
- అమర జవాన్ల కుటుంబాలకు సంతాపం తెలిపిన డిఫెన్స్ సెక్రెటరీ
- వారి త్యాగాన్ని దేశం మరవబోదంటూ వ్యాఖ్య
- కథువాలో ఆర్మీ కాన్వాయ్ పై గ్రనేడ్ దాడి.. ఐదుగురు సోల్జర్ల మృత్యువాత
సోమవారం మధ్యాహ్నం జమ్మూకశ్మీర్ లోని కథువాలో ఆర్మీ కాన్వాయ్ పై ఉగ్రవాదులు దాడి చేశారు. తొలుత కాన్వాయ్ పైకి గ్రనేడ్ విసిరిన ఉగ్రవాదులు.. వాహనాలలో నుంచి కిందికి దిగిన సైనికులపై కాల్పులు జరిపారు. దీంతో ఓ జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్ (జేసీవో) సహా ఐదుగురు సైనికులు వీరమరణం పొందారు. ఆపై ఉగ్రవాదులు దగ్గర్లోని అడవిలోకి పారిపోయారు.
ఈ దాడి తమ పనేనని పాక్ ప్రేరేపిత కశ్మీర్ టైగర్స్ అనే మిలిటెంట్ గ్రూప్ ప్రకటించుకుంది. ఇటీవలి కాలంలో జమ్మూకశ్మీర్ లో ఉగ్ర దాడులు పెరుగుతున్నాయి. గడిచిన రెండు రోజుల్లోనే సైన్యంపై ఉగ్రవాదులు రెండుసార్లు దాడి చేశారు. కుల్గాంలో శనివారం జరిగిన రెండు ఎన్ కౌంటర్లలో భారత సైన్యం ఇద్దరు జవాన్లను కోల్పోయింది. ఈ ఎదురుకాల్పుల్లో మొత్తం ఆరుగురు టెర్రరిస్టులను సైన్యం మట్టుబెట్టింది.