Jagan: బెంగళూరు నుంచి ఏపీకి తిరిగొచ్చిన జగన్

Jagan returns to AP from Bengaluru
షార్ట్స్‌లో చూడండి
ఇటీవల సొంత నియోజకవర్గం పులివెందుల వెళ్లి, అక్కడ్నించి బెంగళూరు వెళ్లిన మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత జగన్... నేడు రాష్ట్రానికి తిరిగొచ్చారు. ఈ సాయంత్రం బెంగళూరు నుంచి గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. గన్నవరం ఎయిర్ పోర్టులో ఆయనకు వైసీపీ శ్రేణులు ఘనస్వాగతం పలికాయి. 

జగన్ కు స్వాగతం పలికిన వారిలో మాజీ మంత్రులు పేర్ని నాని, మేరుగ నాగార్జున, వెల్లంపల్లి శ్రీనివాస్... ఎమ్మెల్సీలు లేళ్ల అప్పిరెడ్డి, తలశిల రఘురామ్, మొండితోక అరుణ్ కుమార్... మాజీ ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, సింహాద్రి రమేశ్ బాబు, దూలం నాగేశ్వరరావు, కైలే అనిల్, బెజవాడ మేయర్ రాయన భాగ్యలక్ష్మి తదితరులు ఉన్నారు. 

కాగా, గన్నవరం ఎయిర్ పోర్టు వద్ద జగన్ ను చూడగానే కార్యకర్తలు సీఎం, సీఎం అంటూ నినాదాలు చేశారు.
Go Back to Shorts
Jagan
Andhra Pradesh
Bengaluru
YSRCP

More Telugu News