రుషికొండ భవనాన్ని జగన్ ఇల్లుగా చూపించడం మానుకోండి: గుడివాడ అమర్నాథ్
- దానిని ఎలా ఉపయోగించుకోవాలన్నది ప్రభుత్వ ఇష్టమన్న అమర్ నాథ్
- తాము మళ్లీ అధికారంలోకి వస్తే విశాఖ నుంచే పాలించాలని అనుకున్నామని వెల్లడి
- ఐఏఎస్ అధికారులతో కమిటీ వేశాకే భవనాలు నిర్మించామని వివరణ
- రాష్ట్రప్రతి, ప్రధాని, గవర్నర్ వంటి వారి ఆతిథ్యానికి వాటిని వాడుకోవచ్చని సూచన
- ప్రజలను తప్పుదోవ పట్టించే చర్యలు మానుకుంటే మంచిదని సలహా
ప్రభుత్వ ధనం దుర్వినియోగం గురించి మాట్లాడాల్సి వస్తే 2014 నుంచి 2019 వరకు జరిగిన దానిపైనా మాట్లాడాల్సి వస్తుందని పేర్కొన్నారు. తాము ఇప్పుడే విమర్శలు చేస్తే అధికారం కోల్పోవడాన్ని జీర్ణించుకోలేక చేస్తున్నామని అనుకుంటారనే అలాంటి విషయాల జోలికి పోవడం లేదని తెలిపారు.
నగరానికి రాష్ట్రపతి, ప్రధాని, గవర్నర్, లేదంటే ఇతర ముఖ్యులు వస్తే ప్రైవేటు హోటళ్లలోనో, మరెక్కడో ఉంచాల్సిన పరిస్థితి వస్తోందని, ఇప్పుడు రుషికొండ భవనాలను వారి ఆతిథ్యానికి వాడుకోవచ్చని వివరించారు. దీనిపై ఇంకా రాద్ధాంతం తగదని హితవు పలికారు. ప్రజలిచ్చిన అధికారాన్ని తమకంటే మంచి చేయడానికి ఉపయోగించాలని, ప్రజలను ఇలా తప్పుదోవ పట్టించే చర్యలకు ఉపయోగించవద్దని అమర్నాథ్ హితవు పలికారు.