హైదరాబాదులో జగన్ నివాసం వద్ద అక్రమ కట్టడాల కూల్చివేత అనంతరం జీహెచ్ఎంసీ అధికారి బదిలీ
- నిన్న లోటస్ పాండ్ లో జగన్ నివాసం వద్ద కొన్ని కట్టడాల కూల్చివేత
- జోనల్ కమిషనర్ హేమంత్ ను జీఏడీలో రిపోర్ట్ చేయాలన్న జీహెచ్ఎంసీ కమిషనర్
- ఉన్నత అధికారుల ఆదేశాలు లేకుండానే కూల్చివేతలు...?
జగన్ నివాసం వద్ద ఫుట్ పాత్ లను ఆక్రమించి సెక్యూరిటీ అవుట్ పోస్టులను నిర్మించారని, తద్వారా ట్రాఫిక్ ఇబ్బందులు కలుగుతున్నాయన్న ఫిర్యాదులతో ఈ కట్టడాలను కూల్చినట్టు తెలుస్తోంది.
ఈ కూల్చివేతలకు ఉన్నతాధికారుల ఆమోదం తీసుకోకుండానే ముందడుగు వేయడం పట్ల తెలంగాణ సర్కారు తీవ్రంగా పరిగణించింది. అయితే, లోటస్ పాండ్ లో జగన్ నివాసానికి సమీపంలో నివాసం ఉంటున్న ఓ మంత్రి నిర్దేశించిన మేరకే జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్ ఈ కూల్చివేతలకు ఉపక్రమించినట్టు సమాచారం.