మాజీ ముఖ్యమంత్రి యడియూరప్పకు హైకోర్టులో ఊరట
- మాజీ ముఖ్యమంత్రి అరెస్ట్‌పై స్టే విధించిన హైకోర్టు
- తదుపరి విచారణ జరిగే వరకు అరెస్ట్ చేయవద్దన్న హైకోర్టు
- ఈ నెల 17న సీఐడీ ఎదుట హాజరుకానున్న బీజేపీ నేత
క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ డిపార్టుమెంట్‌కు చెందిన ప్రత్యేక దర్యాఫ్తు బృందం చేపడుతున్న విచారణకు సంబంధించిన ఫిర్యాదును కొట్టివేయాలని కోరుతూ యడియూరప్ప హైకోర్టును ఆశ్రయించారు. జూన్ 17న సీఐడీ ముందు ఆయన హాజరుకానున్నారని... కాబట్టి అరెస్ట్‌ను నిలిపివేయాలని ఆయన తరఫు న్యాయవాది కోర్టును ఆశ్రయించారు. ఇందుకు కోర్టు అంగీకరించింది.