అయ్యా కేశినేని నానీ... రాజకీయాల నుంచి నువ్వు తప్పుకోవడం కాదు... ప్రజలే నిన్ను తప్పించారు: బుద్దా వెంకన్న

Budda Venkanna reacts to Kesineni Nani statement
  • రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్టు కేశినేని నాని ప్రకటన
  • కేశినేని నానీకి ప్రజలే బుద్ధి చెప్పారన్న బుద్ధా వెంకన్న
  • చంద్రబాబుకు కేశినేని నాని క్షమాపణలు చెప్పాలని డిమాండ్
విజయవాడ మాజీ ఎంపీ కేశినేని నాని రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్టు చేసిన ప్రకటనపై టీడీపీ నేత బుద్ధా వెంకన్న వ్యంగ్యంగా స్పందించారు. 

అయ్యా కేశినేని నానీ... నువ్వు రాజకీయాల నుంచి తప్పుకోవడం కాదు... ప్రజలే నిన్ను తప్పించారు అంటూ సెటైర్ వేశారు. రాష్ట్రమంతా వైసీపీ ఓడిపోవడం ఒకెత్తయితే, విజయవాడ ప్రజలు నిన్ను ఒక్కడ్నీ ఓడించడం మరో ఎత్తు అని ఎత్తిపొడిచారు. 

"రెండుసార్లు నిన్ను పార్లమెంటుకు పంపిన చంద్రబాబును పార్టీలోనే ఉంటూ ఇబ్బంది పెట్టినందుకు ప్రజలే నీకు బుద్ధి చెప్పారు. రెండుసార్లు పార్లమెంటుకు పంపిన చంద్రబాబుకు కనీసం కృతజ్ఞతలైనా చెబుతావని ఆశిస్తున్నాం. అలాగే, రెండోసారి నువ్వు గెలిచినప్పటి నుంచి నీ మాటలతో ఆయనను బాధపెట్టినందుకు క్షమాపణలు చెప్పాలని కోరుకుంటున్నాం" అంటూ బుద్ధా వెంకన్న ట్వీట్ చేశారు.
Go Back to Shorts
Budda Venkanna
Kesineni Nani
Chandrababu
TDP
YSRCP
Vijayawada

More Telugu News