Kevin Pietersen: ప్ర‌ధాని మోదీకి కంగ్రాట్స్‌.. హిందీలో కెవిన్ పీట‌ర్స‌న్ ట్వీట్ వైర‌ల్‌!

Kevin Pietersen congratulates PM Modi with post in Hindi for bagging third term
షార్ట్స్‌లో చూడండి
ప్ర‌ధాని న‌రేంద్ర మోదీకి ఇంగ్లండ్ మాజీ క్రికెట‌ర్ కెవిన్ పీట‌ర్స‌న్ అభినంద‌న‌లు తెలిపారు. మూడోసారి ప్ర‌ధాన‌మంత్రి కానున్న ఆయ‌న‌కు శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తూ హిందీలో ట్వీట్ చేశారు. 

"మ‌రోమారు దేశానికి నేతృత్వం వ‌హించే అవ‌కాశం పొందిన మీకు హృద‌య‌పూర్వ‌క అభినంద‌న‌లు. భార‌తదేశం అభివృద్ధిలో దూసుకుపోతోంది. నేను ఇక్క‌డికి వ‌చ్చిన‌ప్పుడ‌ల్లా అది గ‌మ‌నిస్తున్నా. అద్భుతం అంటూ" ప్ర‌ధాని మోదీపై పీట‌ర్స‌న్ ప్ర‌శంస‌లు కురిపించారు. ఇప్పుడీ ట్వీట్ సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్ అవుతోంది. 

ఇదిలాఉంటే.. వరుసగా మూడోసారి ప్రధానిగా మోదీ ప్రమాణస్వీకారం చేసేందుకు ఇప్ప‌టికే ముహూర్తం ఖరారైంది. ఈ నెల 9న‌ రాత్రి 7.15 గంటలకు ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో ఈ ప్రమాణ స్వీకారోత్సవం జరగనుంది. నరేంద్ర మోదీతోనూ, మంత్రివర్గ సభ్యులతోనూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. ఈ మేరకు రాష్ట్రపతి భవన్ నుంచి ఓ ప్రకటన వెలువడింది.
Go Back to Shorts
Kevin Pietersen
PM Modi
Twitter

More Telugu News