రాష్ట్ర చిహ్నంలోంచి చార్మినార్ ను తొలగించాలనుకోవడం సిగ్గుచేటు: కేటీఆర్
- కాంగ్రెస్ ప్రభుత్వ ఆలోచనపై మండిపడ్డ బీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్
- శతాబ్దాలుగా హైదరాబాద్ కు గుర్తుగా చార్మినార్ ఉందని వెల్లడి
- పనికిమాలిన కారణాలతో దాన్ని తొలగించాలని చూడటం సరికాదని వ్యాఖ్య
‘శతాబ్దాలుగా హైదరాబాద్‌కు ప్రతిరూపంగా, గుర్తుగా చార్మినార్ కొనసాగుతోంది. ఈ విషయం ప్రపంచవ్యాప్తంగా తెలుసు. హైదరాబాద్ గురించి ఎవరైనా తలచుకుంటే చార్మినార్ ను గుర్తుచేసుకోక తప్పదు. యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు పొందే అన్ని లక్షణాలు ఈ చారిత్రక నిర్మాణానికి ఉన్నాయి. కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం పనికిమాలిన కారణాలను సాకుగా చూపుతూ చార్మినార్ చిహాన్ని రాష్ట్ర లోగో నుంచి తొలగించాలని చూస్తోంది. ఎంత సిగ్గుచేటు’ అంటూ కేటీఆర్ మండిపడ్డారు.