Pushpa 2 Song: 'పుష్ప‌-2' నుంచి రెండో సాంగ్ వ‌చ్చేసింది!

Pushpa 2 Second Song Released
షార్ట్స్‌లో చూడండి
అల్లు అర్జున్‌, సుకుమార్‌ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న భారీ సీక్వెల్‌ 'పుష్ప‌-2'. ఆగస్టు 15న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సినిమా విడుదలకు ముందే, తొలిపాట విడుదలై రికార్డులు సృష్టించింది. 'పుష్ప పుష్ప' సాంగ్, స్టెప్ బాగా వైరల్ అయింది. ఇప్పుడు రెండో పాటను కూడా చిత్రం యూనిట్ తాజాగా విడుదల చేసింది. 'సూసేకి అగ్గిరవ్వ మాదిరి ఉంటాడే నా సామి..' అంటూ సాగే ఈ కపుల్‌ సాంగ్‌ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 

ఈ పాటకు సంగీతాన్ని దేవిశ్రీ ప్రసాద్‌ అందించగా, లిరిక్స్‌ చంద్రబోస్‌ రాశారు. శ్రేయా ఘోష‌ల్ పాడారు. అల్లు అర్జున్‌ మరియు హీరోయిన్‌ రష్మిక మందన్నపై చిత్రీకరించిన ఈ పాట, సోషల్‌ మీడియాలో అభిమానులను ఆకట్టుకుంటోంది. పుష్ప-2 సినిమా పట్ల ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. ఇక పుష్పతో పాన్ ఇండియా హిట్ కొట్టి భారీ వ‌సూళ్ల‌తో అదరగొట్టిన బ‌న్నీ.. నేషనల్ అవార్డు సాధించాడు. ఇప్పుడు 'పుష్ప-2'తో ఇంకెన్ని రికార్డులు సాధిస్తాడో చూడాలి.
Go Back to Shorts
Pushpa 2 Song
Allu Arjun
Sukumar
Tollywood

More Telugu News