రద్దీ రోడ్డుపై బైక్‌పై వేగంగా వెళుతూ జంట రొమాన్స్... ఆ తర్వాత చెవులు పట్టుకొని క్షమాపణ
- రాజస్థాన్‌లోని కోటలో ఘటన
- నెట్టింట వైరల్‌గా మారిన వీడియో
- బైక్ నెంబర్‌ను ట్రేస్ చేసి యువకుడిని అరెస్ట్ చేసిన పోలీసులు
ఈ ఘటన కోటలోని హెర్బల్ గార్డెన్ సమీపంలో జరిగినట్లుగా పోలీసులు భావిస్తున్నారు. బండి నెంబర్ ను బట్టి ఆర్టీవో నుంచి వివరాలు సేకరించిన పోలీసులు యువకుడిని అరెస్ట్ చేశారు. అతనిని కైతున్ పట్టణానికి చెందిన మహ్మద్ వాసీమ్‌గా (25) గుర్తించారు.
ఈ ఘటనపై కోట పోలీసులు ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. 'కదులుతున్న మోటార్ సైకిల్‌పై అసభ్యకరంగా ప్రదర్శించిన జంటను కోట సిటీ పోలీస్ బృందం అరెస్ట్ చేసింది. మీకు సేవ చేసేందుకు కోట సిటీ పోలీసులు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటార'ని పేర్కొంది. మరో ట్వీట్‌లో ఎఫ్ఐఅర్ నమోదు చేసినట్లు తెలిపింది. ఐపీసీ సెక్షన్ 294A కింద కేసు నమోదు చేశారు. నిందితుడు మహ్మద్ వసీం, యువతిపై పోలీసులు చట్టపరమైన చర్యలు తీసుకున్నారు. మోటార్ సైకిల్‌ను స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు... వారిద్దరి చెవులు పట్టించి క్షమాపణలు చెప్పించారు. మరోసారి ఇలాంటి తప్పు చేయమని... మరెవరూ కూడా ఇలా చేయవద్దని వారితో చెప్పించారు.