రాయలసీమలో ఫ్యాక్షనిజం బంద్ అయింది... కొల్లాపూర్లో ప్రారంభమైంది: శ్రీనివాస్ గౌడ్
- కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పాలమూరు జిల్లాలో కాంగ్రెస్ దారుణాలకు పాల్పడుతోందని ఆగ్రహం
- బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు అభివృద్ధిపై దృష్టి సారించాం తప్ప దారుణాలకు పాల్పడలేదన్న మాజీ మంత్రి
- ముఖ్యమంత్రి జిల్లాలో వరుసగా హత్యలు జరుగుతుంటే సమీక్ష జరపాలన్న శ్రీనివాస్ గౌడ్
చివరకు రాయలసీమలో కూడా ఇప్పుడు ప్రశాంతంగా ఉందన్నారు. ఎన్నికల సమయంలో మాత్రమే వారు జోరుగా ప్రచారం చేస్తున్నారని... కానీ తర్వాత కలిసి ముందుకు సాగుతున్నారన్నారు. కానీ కొల్లాపూర్లో మాత్రం కాంగ్రెస్ నేతలు అరాచకానికి పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాము పదేళ్లు అధికారంలో ఉన్నప్పటికీ ఇలాంటి దారుణాలకు పాల్పడలేదన్నారు.
తాము అభివృద్ధి పైనే దృష్టి సారించామన్నారు. అమాయకులను హత్య చేయించడం దారుణమన్నారు. ఇలాంటి పరిస్థితులు గ్రామాల నుంచి మండలాలకు పాకుతాయని హెచ్చరించారు. ముఖ్యమంత్రి జిల్లాలో వరుస హత్యలు జరుగుతున్నాయంటే సమీక్ష జరపాల్సిన బాధ్యత లేదా? అని నిలదీశారు. శ్రీధర్ రెడ్డి హత్యలో దోషులను శిక్షించాలని డిమాండ్ చేశారు. సిట్ లేదా జ్యుడీషియల్ విచారణ జరిపించాలన్నారు.