ఆగని బాంబు బెదిరింపు మెయిల్స్... బెంగళూరులోని మూడు హోటల్స్‌కు బెదిరింపు
- కొన్నిరోజులుగా దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో బాంబు బెదిరింపు మెయిల్స్
- బెంగళూరులోని ఒట్టేరా హోటల్ సహా మూడు హోటల్స్‌కు గురువారం బెదిరింపు మెయిల్స్
- తనిఖీల్లో ఎలాంటి అనుమానాస్పద వస్తువులను గుర్తించని పోలీసులు
దౌడీ జైవాల్ అనే వ్యక్తి పేరుతో ఈ మెయిల్స్ వచ్చినట్లుగా గుర్తించారు. తాను ఓ సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ కొడుకుగా చెప్పుకున్నాడు. అతను ఈ హోటల్స్ ఫ్రంట్ డెస్క్‌కు ఈ మెయిల్స్ పంపించాడు. బెదిరింపు మెయిల్స్ నేపథ్యంలో పోలీసులు ముమ్మర తనిఖీలు చేపట్టారు. సమీప ప్రాంతాల్లో పెద్ద ఎత్తున పోలీసులను మోహరించారు. అయితే ఇప్పటి వరకు ఎలాంటి అనుమానాస్పద వస్తువులను గుర్తించలేదు. గతంలోను నలభై స్కూల్స్, ఆసుపత్రులకు బెదిరింపు మెయిల్స్ వచ్చాయి.