సగానికి సగం తగ్గిన డయాబెటిస్, గుండె జబ్బుల మందుల ధరలు
- సాధారణంగా వినియోగించే 41 రకాల మందుల ధరలతోపాటు మరో ఆరు రకాల మందుల ధరల తగ్గింపు
- నోటిఫికేషన్ జారీచేసిన ఎన్‌పీపీఏ
- దేశంలో 10 కోట్ల మందికిపైగా మధుమేహ రోగులు
- రూ. 16కు దిగిన వచ్చిన డపాగ్లిఫోజిన్ మెట్‌ఫార్మిన్ హైడ్రోక్లోరైడ్ ట్యాబ్లెట్ ధర
ప్రపంచంలో మరే దేశంలోనూ లేనంతగా భారత్‌లో 10 కోట్లమందికిపైగా మధుమేహ బాధితులున్నారు. మందులు, ఇన్సులిన్‌పై ఆధారపడే వారికి ధరల తగ్గింపు పెద్ద ఉపశమనంగానే చెప్పుకోవాలి. డయాబెటిస్‌ను నియంత్రణలో ఉంచుకునేందుకు వేసుకునే డపాగ్లిఫోజిన్ మెట్‌ఫార్మిన్ హైడ్రోక్లోరైడ్ ట్యాబ్లెట్ ధర ఒకటి ప్రస్తుతం రూ. 30 ఉండగా, అదిప్పుడు రూ. 16కు దిగివచ్చింది. వీటితో పాటు పైన పేర్కొన్న మందుల ధరలన్నీ భారీగా తగ్గాయి.