దెయ్యాన్ని ప్రేమిస్తే ఏమౌతుంది?: 'లవ్ మీ' ట్రైలర్ రిలీజ్
- దిల్ రాజు బ్యానర్ పై రూపొందిన 'లవ్ మీ'
- ఆశిష్ జోడీగా కనిపించనున్న వైష్ణవీ చైతన్య
- సంగీతాన్ని సమకూర్చిన కీరవాణి
- ఈ నెల 25వ తేదీన సినిమా విడుదల
హీరోకి ఒక అలవాటు ఉంటుంది. ఎవరైనా ఏదైనా ఒక పని చేయకూడదు అని చెబితే, ఆ పని చేసేవరకూ అతనికి నిద్రపట్టదు. అలాంటి హీరోకి ఒక దెయ్యం గురించి తెలుస్తుంది. అటు వైపు వెళ్లొద్దని అతని సన్నిహితులు చెబుతారు. దాంతో ఆ దెయ్యం దగ్గరికి వెళ్లి తీరాలని నిర్ణయించుకుంటాడు. ఇదే అంశాన్ని ఈ ట్రైలర్ ద్వారా చెప్పారు. ఈ నెల 25వ తేదీన ఈ సినిమా విడుదల కానుంది.
ఈ సినిమాలో హీరో దెయ్యంతో రొమాన్స్ చేయాలనే ఒక ఆలోచనలో ఉంటాడు. ఈ విషయంలో ఎవరు ఎంతగా చెబుతున్నా వినిపించుకోకుండా ముందుకు వెళతాడు. ఫలితంగా ఏం జరుగుతుంది? అనేది కథ. నిజానికి ఇది కాస్త చిత్రంగా అనిపించినా, కొత్తగా అయితే ఈ పాయింటును టచ్ చేశారు. ఆ పాయింట్ తో ఎంతవరకూ మెప్పిస్తారనేది చూడాలి మరి.