గెలిస్తే జైలుకు వెళ్లాల్సిన అవసరం లేదన్న కేజ్రీవాల్ వ్యాఖ్యలపై స్పందించిన సుప్రీంకోర్టు
- తీర్పుపై విమర్శలను స్వాగతిస్తున్నట్లు వెల్లడి
- కేజ్రీవాల్ ఎప్పుడు లొంగిపోవాలో తమ ఆదేశాల్లో స్పష్టంగా ఉందన్న న్యాయస్థానం
- ఎవరికీ మినహాయింపు ఉండదని స్పష్టీకరణ
అదే సమయంలో కేజ్రీవాల్‌కు బెయిల్ రావడంపై కేంద్రంలోని ఓ సీనియర్ మంత్రి చేసిన వ్యాఖ్యలపై ఆయన తరఫు న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు.
ఇరువైపుల వాదనలను సుప్రీంకోర్టు విన్న తర్వాత.. ఈ తీర్పుపై విమర్శలను స్వాగతిస్తున్నట్లు పేర్కొంది. ఆయన ఎప్పుడు లొంగిపోవాలో తమ ఆదేశాల్లో స్పష్టంగా ఉందని తెలిపింది. ఇది సుప్రీంకోర్టు ఆదేశమని... చట్టపాలన దీని ఆధారంగానే సాగుతుందన్నారు. ఎవరికీ మినహాయింపు ఉండదని స్పష్టం చేసింది.