ఏపీ ఇసుక మైనింగ్ కేసు.. సుప్రీంకోర్టు మార్గదర్శకాలివే!
- ప్రతి జిల్లాలో పోలీసు అధికారులతో కమిటీ ఏర్పాటు చేయాలన్న సుప్రీంకోర్టు
- ఫిర్యాదుల స్వీకరణ, పరిష్కారం కోసం వ్యవస్థ ఏర్పాటుకు సుప్రీం ఆదేశం
- టోల్‌ఫ్రీ నంబర్, ఈమెయిల్ ఏర్పాటుతో విస్తృత ప్రచారం కల్పించాలన్న న్యాయస్థానం
ఇసుక మైనింగ్‌పై సుప్రీం మరిన్ని మార్గదర్శకాలివే..
- కేంద్రపర్యావరణశాఖ తరచూ తనిఖీలు చేపట్టాలి
- తనిఖీల సమాచారం రాష్ట్ర అధికారులకు ఇవ్వనవసరంలేదు
- కోర్టు ఉత్తర్వులు ఉల్లంఘిస్తే చర్యలకు వెనుకాడవద్దు
- ఎన్జీటీ తీర్పులోని ప్రతి అంశం తప్పక పాటించాలి
- కేంద్ర అధికారులు గుర్తించిన మైనింగ్ ప్రదేశాల వివరాలు రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వాలి
- మైనింగ్ జరిగిన ప్రదేశాలను కలెక్టర్లు తనిఖీ చేయాలి
- ఉల్లంఘనలపై కేసులు నమోదు చేసి క్రిమినల్ చర్యలు చేపట్టాలి
- జులై 9లోపు ఆదేశాల అమలుపై కేంద్రం, రాష్ట్రం అఫిడవిట్ ఇవ్వాలి