ఏపీలో పోటెత్తిన ఓటర్లు.. సీఎం జగన్ ఆసక్తికర ట్వీట్
- రాష్ట్రవ్యాప్తంగా పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్ల బార్లు
- అందరూ కదిలి రండి.. తప్పకుండా ఓటు వేయండంటూ సీఎం జగన్ పిలుపు
- ఎక్స్ వేదికగా స్పందించిన వైసీపీ అధినేత
ఓటర్లకు సీఎం జగన్ సందేశం
అన్ని వర్గాల ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు తరలి వెళ్లి ఓటు హక్కుని వినియోగించుకోవాలని ఏపీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కోరారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఆయన స్పందించారు. ‘‘నా అవ్వాతాతలందరూ…నా అక్కచెల్లెమ్మలందరూ… నా అన్నదమ్ములందరూ… నా రైతన్నలందరూ… నా యువతీయువకులందరూ… నా ఎస్సీ… నా ఎస్టీ… నా బీసీ… నా మైనారిటీలందరూ… అందరూ కదిలి రండి, తప్పకుండా ఓటు వేయండి!’’ అంటూ తన సందేశం ఇచ్చారు.