మిస్టర్ బీస్టా మజాకా.. బర్త్‌డే గిఫ్ట్‌గా ఫాలోవర్లకు 26 టెస్లా కార్లు!
- తన 26వ బర్త్‌డే సందర్భంగా 26 టెస్లా కార్లను గిఫ్ట్‌గా ఇస్తున్న సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్
- ఆన్లైన్లో మిస్టర్ బీస్ట్‌గా పాప్యులర్ అయిన జేమ్స్ స్టీఫెన్ డొనాల్డ్సన్
- యూట్యూబ్‌లో 254 మిలియన్లకు పైగా సబ్స్క్రైబర్లతో దూసుకెళ్తున్న అమెరికన్ యూట్యూబర్
ఇక జేమ్స్ స్టీఫెన్ డొనాల్డ్సన్ ఆన్లైన్లో మిస్టర్ బీస్ట్‌గా బాగా పాప్యులర్ అయ్యారు. ఆయన ఒక అమెరికన్ యూట్యూబర్. 254 మిలియన్లకు పైగా సబ్స్క్రైబర్లతో ఆయన యూట్యూబ్‌లో అత్యధికంగా సబ్స్క్రయిబ్ కలిగిన వ్యక్తిగా కొనసాగుతున్నారు. ఆయన 2012 ప్రారంభంలో 13 ఏళ్ల వయస్సులో మిస్టర్ బీస్ట్ 6000 పేరిట మొదట ఓ యూట్యూబ్ ఛానెల్ ప్రారంభించారు. ఆ తర్వాత బీస్ట్ రియాక్ట్స్, మిస్టర్ బీస్ట్ గేమింగ్, మిస్టర్ బీస్ట్ 2 (గతంలో మిస్టర్ బీస్ట్ షార్ట్స్), అలాగే దాతృత్వ ఛానెల్ బీస్ట్ ఫిలాంత్రోపీని నడుపుతున్నారు.