బెంగళూరుకు పాకిన పైత్యం.. మెట్రో రైల్ లో జంట అసభ్య చేష్టలు
- జనం చూస్తుండగా ముద్దులు పెట్టుకున్న జంట
- వీడియో తీసి మెట్రో అధికారులకు ట్వీట్ చేసిన ప్రయాణికుడు
- స్పందించిన పోలీసులు.. యువ జంటను గుర్తించేందుకు ప్రయత్నాలు
ట్విట్టర్ లో అప్ లోడ్ చేసిన సదరు వీడియోలో యువ జంట నిల్చుని ఉండగా పక్కనే ఓ పెద్దాయన కూర్చుని కనిపిస్తున్నాడు. చుట్టూ జనం ఉన్నా కూడా పట్టించుకోకుండా ఆ యువతి తన సహచరుడి మీద వాలిపోయింది. పదకొండు సెకండ్లు ఉన్న ఈ వీడియో క్లిప్ పోస్ట్ చేసిన ప్రయాణికుడు.. ఆ తర్వాత వారు మరింత రెచ్చిపోయారని, పబ్లిక్ ప్లేసులో ముద్దులు పెట్టేసుకున్నారని చెప్పాడు. అయితే, అదంతా రికార్డు చేయలేక వదిలేశానని వివరించాడు. కాగా, ఈ ట్వీట్ పై పోలీసులు స్పందించారు. ఆ యువజంటను గుర్తించి, చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.