అరాచకాలకు పాల్పడుతున్నా ఎంఐఎంపై కేసులు లేనిది అందుకే: సీపీఐ నారాయణ
- కేరళలో విజయన్‌ను రేవంత్ విమర్శించకుండా ఉండాల్సిందన్న నారాయణ
- ఆయా రాష్ట్రాల్లోని పరిస్థితులను బట్టే పొత్తులు ఉంటాయని స్పష్టీకరణ
- ఇండియా కూటమిలో మిత్రులమే కానీ, కేరళలో ప్రత్యర్థులమన్న సీపీఐ అగ్రనేత
జాతీయస్థాయిలో ఇండియా కూటమిని బలోపేతం చేస్తున్నామన్న నారాయణ.. ఆ రాష్ట్రాల్లోని పరిస్థితులను బట్టి పొత్తులు, పోటీ పెట్టుకుంటున్నట్టు తెలిపారు. వయనాడ్‌లో రాహుల్‌గాంధీ పోటీపై మాట్లాడుతూ అక్కడ సీట్ల సర్దుబాటు కుదరకపోవడంతోనే విడివిడిగా పోటీచేస్తున్నట్టు తెలిపారు. ఇండియా కూటమిలో తాము మిత్రులమే అయినా, కేరళలో మాత్రం కాంగ్రెస్‌కు తాము ప్రత్యర్థులమేనని పేర్కొన్నారు. తెలంగాణలో పోటీ నుంచి తప్పుకోవడానికి అనేక కారణాలు ఉన్నాయని చెప్పారు. సీట్లు అడిగినా కాంగ్రెస్ ఇవ్వలేదని, అంతమాత్రాన బీజేపీ, బీఆర్ఎస్‌కు మద్దతు ఇవ్వలేమని నారాయణ స్పష్టం చేశారు.