తెలివిగా ఓటేయండి.. హర్ష గోయెంకా ట్వీట్ వైరల్!
- నేతల వాగ్దానాలపై కాకుండా పనితీరుపై ఆలోచించి తెలివిగా ఓటు వేయాలన్న హర్ష గోయెంకా
- పాలకుల చేతిలో బకరా కావొద్దనే అర్థం వచ్చేలా ఓ పెద్ద మేకపోతు ఫొటోను ట్వీట్ చేసిన వైనం
- సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పారిశ్రామికవేత్త పోస్ట్
'ప్రజలారా జాగ్రత్త.. నేతల వాగ్దానాలపై కాకుండా పనితీరుపై ఆలోచించండి. తెలివిగా ఓటు వేయండి. మోసపోకండి' అంటూ ట్వీట్ చేశారు. దానికి పాలకుల చేతిలో మనం బకరా కావొద్దు అని అర్థం వచ్చేలా ఓ పెద్ద మేకపోతు ఫొటోను జోడించారు. ఇప్పుడీ ట్వీట్ నెట్టింట వైరల్ అవుతోంది. కాగా, కొన్ని రోజుల ముందు కూడా ఇదే మాదిరి ఓటు విలువను తెలియజేసే.. షారూఖ్ ఖాన్ నటించిన లేటెస్ట్ బ్లాక్‌బస్టర్ 'జవాన్' మూవీలోని డైలాగ్‌తో కూడిన వీడియోను కూడా హర్ష గోయెంకా ట్వీట్ చేసిన విషయం తెలిసిందే.