ఆ పాపాలను కొనసాగిస్తున్న కాంగ్రెస్ యువరాజు.. రాహుల్ పై మోదీ ధ్వజం
- రాజులు, మహారాజులను అవమానిస్తూ వచ్చిన రాహుల్.. నవాబులు, సుల్తాన్ల అరాచకాలపై మౌనంగా ఉన్నారు
- బుజ్జగింపు రాజకీయాల కోసమే రాహుల్ ఆరాటమని మండిపాటు
- కర్ణాటకలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో విమర్శలు
వారి దౌర్జన్యాలపై నోరు మెదపలేదేం?
గతంలో దేశంలో రాజులు, మహారాజులు పేదల భూములను ఆక్రమించారని రాహుల్ గాంధీ ఆరోపించారని.. ఛత్రపతి శివాజీ, కిత్తూరు రాణి చన్నమ్మ వంటి వారిని కూడా అవమానించారని విమర్శించారు. ఓ వర్గం ఓటు బ్యాంకు, బుజ్జగింపు రాజకీయాల కోసమే అలా మాట్లాడారని ఆరోపించారు. అదే మొఘల్ చక్రవర్తి ఔరంగ జేబు పాల్పడిన దారుణాలు, దేవాలయాలను కూల్చివేసిన విషయం గురించి రాహుల్ మరచిపోయారా అని ప్రశ్నించారు.