Manda Jagannath: మాజీ ఎంపీ మంద జగన్నాథ్ కు షాక్.. నామినేషన్ తిరస్కరణ

Manda Jagannath nomination rejected
షార్ట్స్‌లో చూడండి
లోక్ సభ ఎన్నికల నామినేషన్ల పరిశీలన సందర్భంగా ఊహించని పరిణామం చోటు చేసుకుంది. తెలంగాణలో నాగర్ కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగిన మాజీ ఎంపీ మంద జగన్నాథ్ కు షాక్ తగిలింది. ఆయన దాఖలు చేసిన నామినేషన్ తిరస్కరణకు గురైంది. పార్టీ బీఫామ్ లేనందువల్ల నామినేషన్ తిరస్కరిస్తున్నట్టు ఎన్నికల రిటర్నింగ్ అధికారి తెలిపారు. బీఎస్పీ తరపున ఆయన నామినేషన్ వేశారు. అయితే, పార్టీ బీఫామ్ లేనందువల్ల ఆయన పోటీ నుంచి అనూహ్యంగా నిష్క్రమించాల్సి వచ్చింది. ఎన్నికల షెడ్యూల్ ప్రకారం ఈరోజు నామినేషన్ల పరిశీలన జరిగింది. అభ్యర్థుల నామినేషన్లను అధికారులు నిశితంగా పరిశీలించారు.
Go Back to Shorts
Manda Jagannath
BSP
Nomination

More Telugu News