నామినేషన్ కు వస్తుంటే వైసీపీ కార్యకర్తలు అడ్డుకునే ప్రయత్నం చేశారు: పులివర్తి నాని
- చంద్రగిరి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న పులివర్తి నాని
- నేడు నామినేషన్ దాఖలు
- రోడ్డు బ్లాక్ చేయడంతో నడుచుకుంటూ వచ్చి నామినేషన్ వేశానన్న నాని
- భాస్కర్ రెడ్డి కుట్రలకు భయపడే పరిస్థితి లేదని స్పష్టీకరణ
కాగా, తాను నామినేషన్ కు వెళుతుంటే వైసీపీ కార్యకర్తలు అడ్డుకునేందుకు ప్రయత్నించారని పులివర్తి నాని ఆరోపించారు. రోడ్డు బ్లాక్ చేయడంతో, నడుచుకుని వచ్చి నామినేషన్ వేయాల్సి వచ్చిందని వెల్లడించారు. ఎంత బెదిరించినా భయపడకుండా కార్యకర్తలు గట్టిగా పనిచేయాలని పులివర్తి నాని పిలుపునిచ్చారు.
వైసీపీ వాళ్లు రాళ్లు వేస్తే... పోలీసులు తమ వాళ్లను తీసుకెళ్లారని మండిపడ్డారు. భాస్కర్ రెడ్డి కుట్రలకు భయపడే పరిస్థితి లేదని స్పష్టం చేశారు. ఈ 15 రోజులు ఎంత రెచ్చగొట్టినా రెచ్చిపోమని.. దెబ్బలు తినేందుకు కూడా సిద్ధమేనని నాని ప్రకటించారు. ఎన్నికల్లో వైసీపీకి ప్రజలే బుద్ధి చెబుతారని అన్నారు.