రజనీకాంత్ కొత్త చిత్రం టైటిల్ ఇదే!... టైటిల్ టీజర్ అదిరిపోయింది!
- రజనీకాంత్ 171వ చిత్రానికి కూలీ అనే టైటిల్ ఖరారు
- లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో చిత్రం
- నేడు టైటిల్ టీజర్ రిలీజ్
"మన తాతలు ముత్తాతలు వచ్చారు పోయారు... తప్పేంటి ఒప్పేంటి... కొత్తగా కుమ్మేసెయ్... ఏ దారిలో వెళ్లినా సుఖాన్ని విడువకు" అంటూ రజనీకాంత్ వెరైటీ సందేశం ఇవ్వడం టీజర్ కు హైలైట్ గా నిలిచింది.
"విందుంది, చిందుంది, మందుంది, సుఖముంది, అనుభవించే మనసుందంటే... స్వర్గంలో చోటుంటుంది... పోరా...! అంటూ మరో విలక్షణ డైలాగ్ కూడా రజనీ పలకడం టీజర్ లో చూడొచ్చు. కాగా, ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నాడు. త్వరలో ఇతర తారాగణం వివరాలు ప్రకటించనున్నారు.