ముఖ్యమంత్రి గారూ... మీ ఇద్దరూ ఇక బ్యాండేజీలు తీసేయండి: వర్ల రామయ్య
- ఏప్రిల్ 13న సీఎం జగన్ పై విజయవాడలో రాయి దాడి
- సీఎం జగన్ నుదుటికి గాయం... మాజీ మంత్రి వెల్లంపల్లి కంటికి గాయం
- జగన్ గాయానికి మూడు రోజులు బ్యాండేజి చాలన్న వర్ల రామయ్య
- వెల్లంపల్లి కంటి దెబ్బకు రెండున్నర రోజులు బ్యాండేజి చాలని వెల్లడి
ఈ అంశాలపై టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య స్పందించారు. "ముఖ్యమంత్రి గారూ... మీరు, మీ అనుచరుడు వెల్లంపల్లి శ్రీనివాస్ మీ మీ బ్యాండేజిలు తీసేయండి. మీ నుదుటి దెబ్బకు మూడు రోజుల బ్యాండేజి చాలు. వెల్లంపల్లి కంటి దెబ్బకు రెండున్నర రోజులు చాలు. వెల్లంపల్లి కంటి బ్యాండేజి వెంటనే తీయకుండా ఎన్నికల దాకా ఉంచుకుంటే మొదటికే మోసం... గ్రహించగలరు" అంటూ ట్వీట్ చేశారు.