పిఠాపురంలో పవన్ కల్యాణ్ నామినేషన్ వేసేందుకు ముహూర్తం ఖరారు
- ఈసారి ఎన్నికల్లో పిఠాపురం అసెంబ్లీ స్థానం నుంచి పవన్ కల్యాణ్ పోటీ
- ఈ నెల 23న నామినేషన్ వేయనున్న జనసేనాని
- పవన్ కల్యాణ్ స్వయంగా నామినేషన్ పత్రాలు సమర్పిస్తారన్న జనసేన పార్టీ
- అదే రోజు సాయంత్రం ఉప్పాడలో భారీ బహిరంగ సభ
పిఠాపురం నియోజకవర్గ రిటర్నింగ్ అధికారికి పవన్ కల్యాణ్ స్వయంగా నామినేషన్ పత్రాలు సమర్పిస్తారని జనసేన పార్టీ ఓ ప్రకటనలో వెల్లడించింది. అదే రోజు సాయంత్రం కాకినాడ జిల్లా ఉప్పాడలో జరిగే బహిరంగ సభకు జనసేనాని హాజరవుతారని వివరించింది.