జగన్ కోసం మానవబాంబును అవుతా.. దువ్వాడ శ్రీనివాస్ హెచ్చరిక
- జగన్‌కు వైసీపీ కార్యకర్తలంతా అండగా ఉన్నారన్న శ్రీనివాస్
- జగన్ సూచనతోనే సంయమనం పాటిస్తున్నామన్న టెక్కలి అభ్యర్థి
- తాము తలచుకుంటే చంద్రబాబు, పవన్ రోడ్డెక్కే పరిస్థితి ఉండదని హెచ్చరిక
జగన్‌పై విసిరిన రాయి నుదిటిపై తగిలింది కాబట్టి సరిపోయిందని, అదే కొంచెం ఎడమ వైపో, కుడివైపో తగిలి ఉంటే పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. జగన్‌పై ఆధారపడిన కోటాను కోట్లమంది ప్రజల జీవితాలు ఏమయ్యేవని ఆవేదన వ్యక్తంచేశారు. జగన్‌ను రక్షించుకోవడానికి తానే కాదని, తనలాంటి లక్షలాదిమంది ఆత్మాహుతి బాంబులం అవుతామని శ్రీనివాస్ హెచ్చరించారు.