మాజీ వ్యాపార భాగస్వామిపై ధోనీ క్రిమినల్ కేసు.. అరెస్ట్
- క్రికెట్ అకాడమీ స్థాపనలో ధోనీ పేరు దుర్వినియోగం
- ధోనీతో తనకున్న అనుబంధాన్ని పెట్టుబడిగా మార్చుకునేందుకు యత్నించిన మిహిర్ దివాకర్
- ధోనీ ఫిర్యాదుతో పలు సెక్షన్ల కింద కేసు నమోదు
జైపూర్‌లో క్రికెడ్ అకాడమీ స్థాపనలో మిహిర్ అనధికారికంగా ధోనీ పేరును వాడుకున్నట్టు ఆరోపణలున్నాయి. ఈ నేపథ్యంలో ధోనీ ఫిర్యాదు మేరకు మిహిర్‌పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు. క్రికెట్ అకాడమీలు ప్రారంభించేందుకు ధోనీతో తనకున్న అనుబంధాన్ని మిహిర్ తప్పుగా ఉపయోగించుకున్నట్టు ఆరోపణలున్నాయి. తన పేరును ఉపయోగించుకోవడానికి వీల్లేదంటూ తన ఆథరైజేషన్‌ను ధోనీ ఉపసంహరించుకున్న తర్వాత కూడా మిహిర్ ఆయన పేరును దుర్వినియోగం చేయడంతో ధోనీ ఆయనపై క్రిమినల్ కేసు పెట్టాడు.