కాసేపట్లో ప్రజాగళం సభ... తణుకు చేరుకున్న పవన్ కల్యాణ్
- ఎన్నికల ప్రచారం ముమ్మరం చేస్తున్న కూటమి నేతలు
- తణుకు సభకు హాజరుకానున్న చంద్రబాబు, పవన్
- సభ ప్రారంభానికి ముందు రోడ్ షో!
ప్రస్తుతం సభా ప్రాంగణం వద్ద మూడు పార్టీల జెండాలు, అభిమానుల నినాదాలతో కోలాహలం నెలకొంది. కాగా, ఈ సభ ప్రారంభానికి ముందు చంద్రబాబు, పవన్ తణుకు పాలిటెక్నిక్ కళాశాల నుంచి నరేంద్ర సెంటర్ వరకు రోడ్ షో నిర్వహిస్తారని తెలుస్తోంది.
తణుకు సభ అనంతరం నిడదవోలు సభకు పయనమవుతారు. నిడదవోలు సభలో చంద్రబాబు, పవన్ తో పాటు ఏపీ బీజేపీ చీఫ్ పురందేశ్వరి కూడా పాల్గొంటారు.

