క్రోధి నామ సంవత్సరంలో కూటమి ప్రభుత్వాన్ని స్థాపిస్తున్నాం: పవన్ కల్యాణ్
- చేబ్రోలులో గృహప్రవేశం చేసిన పవన్ కల్యాణ్
- ఉగాది వేడుకల్లో పాల్గొన్న వైనం
- ప్రజలంతా బాగుండాలని కోరుకుంటున్నానని వెల్లడి
క్రోధి నామ సంవత్సరంలో కూటమి ప్రభుత్వాన్ని స్థాపిస్తున్నామని ధీమా వ్యక్తం చేశారు. పిఠాపురం నుంచే విజయకేతనం ఎగురవేయబోతున్నామని ఆత్మవిశ్వాసం వెలిబుచ్చారు.
ఈ క్రోధి నామ సంవత్సరం ప్రజలకు మేలు చేయాలని, మహిళలకు మరింత ప్రోత్సాహం లభించాలని ఆకాంక్షిస్తున్నట్టు పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. ఉద్యోగులకు ఒకటో తేదీనే జీతాలు రావాలని, క్రోధి నామ సంవత్సరంలో రైతులకు మేలు జరగాలని కోరుకుంటున్నట్టు తెలిపారు.