ఆహా ఫ్లాట్ ఫామ్ పైకి 'ప్రేమలు'
- ఫిబ్రవరి 9న విడుదలైన 'ప్రేమలు'
- మలయాళంలో నమోదైన మరో బ్లాక్ బస్టర్ ఇది
- మార్చి 8న తెలుగు వెర్షన్ రిలీజ్
- ఈ నెల 12 నుంచి మొదలుకానున్న స్ట్రీమింగ్
కథ ప్రకారం కేరళ ప్రాంతం నుంచి హైదరాబాద్ వచ్చిన హీరో, ఇక్కడి అమ్మాయితో లవ్ లో పడతాడు. అందువలన తెలుగు ఆడియన్స్ కి ఈ సినిమా బాగా కనెక్ట్ అయింది. ఫలితంగా లాభాల బాట పట్టడానికి ఈ సినిమా ఎక్కువ సమయం తీసుకోలేదు. అలాంటి ఈ సినిమా ఇప్పుడు ఓటీటీ ఫ్లాట్ ఫామ్ పైకి రావడానికి రెడీ అవుతోంది.
ఈ నెల 12వ తేదీ నుంచి ఈ సినిమా 'ఆహా' సెంటర్ లో స్ట్రీమింగ్ కానుంది. అందుకు సంబంధించిన అధికారిక పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు. లవ్ స్టోరీస్ లో ఉండవలసింది ఫీల్ .. అలాగే కథకి అవసరమైన కామెడీ. అలాంటి ఫీల్ ను వర్కౌట్ చేయుటం వల్లనే ఈ సినిమా యూత్ కి బాగా చేరువైంది. ఓటీటీ వైపు నుంచి కూడా ఈ సినిమా ఒక రేంజ్ లో సందడి చేయడం ఖాయమనే చెప్పాలి.