'పుష్ప-2'లో శ్రీవల్లి లుక్ అదిరిపోయిందిగా..!
- రష్మిక మందన్న పుట్టినరోజు సందర్భంగా ఫస్ట్ లుక్ పోస్టర్
- పుష్ప-2తో పాటు ది గర్ల్‌ఫ్రెండ్, రెయిన్‌బో చిత్రాల్లో నటిస్తున్న బ్యూటీ
- ఆగస్టు 15వ తేదీన సినిమా థియేటర్లలో సందడి చేయనున్న 'పుష్ప: ది రూల్'
ఇక పుష్ప-2 మూవీ ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఆగస్టు 15వ తేదీన సినిమా థియేటర్లలో సందడి చేయనుంది. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పుష్ప: ది రూల్ పై భారీ అంచనాలు ఉన్నాయి. ఎందుకంటే ఇంతకుముందు వచ్చిన పుష్ప చిత్రం బ్లాక్‌బస్టర్ హిట్ అయిన విషయం తెలిసిందే. దానికి సీక్వెల్‌గానే 'పుష్ప-2' వస్తోంది. రాక్‌స్టార్ దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. కాగా, ఈ నెల 8న హీరో అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా చిత్ర టీజర్‌ను విడుదల చేయనున్నట్లు పుష్ప మూవీ టీమ్ ఇప్పటికే ప్రకటించింది. దీంతో అభిమానులు టీజర్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.