మోదీ స్టేడియంలో అమీతుమీ... గుజరాత్ పై టాస్ నెగ్గిన పంజాబ్ కింగ్స్

PBKS won the toss against Gujarat Titans
ఐపీఎల్ లో ఇవాళ గుజరాత్ టైటాన్స్, పంజాబ్ కింగ్స్ మధ్య మ్యాచ్ జరుగుతోంది. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియం ఈ మ్యాచ్ కు వేదిక. టాస్ నెగ్గిన పంజాబ్ కింగ్స్ బౌలింగ్ ఎంచుకుంది. 

ఈ మ్యాచ్ కోసం పంజాబ్ కింగ్స్ జట్టులో ఒక మార్పు జరిగింది. హార్డ్ హిట్టర్ లియామ్ లివింగ్ స్టన్ స్థానంలో ఆల్ రౌండర్ సికందర్ రజాకు స్థానం కల్పించారు. అటు, ఈ సీజన్ లో కేన్ విలియమ్సన్ తొలి మ్యాచ్ ఆడుతున్నాడు. గుజరాత్ టైటాన్స్ జట్టులో డేవిడ్ మిల్లర్ గాయంతో బాధపడుతుండడంతో, అతడి స్థానంలో కేన్ విలియమ్సన్ కు తుది జట్టులో చోటిచ్చారు. 

టోర్నీలో ఇప్పటివరకు గుజరాత్ టైటాన్స్ 3 మ్యాచ్ లు ఆడి రెండింట్లో విజయం సాధించింది. పంజాబ్ కింగ్స్ 3 మ్యాచ్ లు ఆడి 1 మ్యాచ్ నెగ్గింది.

ఇరు జట్లలో గమనించదగ్గ ఆటగాళ్లు...

గుజరాత్ టైటాన్స్: శుభ్ మాన్ గిల్, సాయి సుదర్శన్, రషీద్ ఖాన్, నూర్ అహ్మద్, కేన్ విలియమ్సన్, వృద్ధిమాన్ సాహా.

పంజాబ్ కింగ్స్: శిఖర్ ధావన్, బెయిర్ స్టో, జితేశ్ శర్మ, శామ్ కరన్, సికందర్ రజా, కగిసో రబాడా, అర్షదీప్ సింగ్.
Go Back to Shorts
IPL 2024
Gujarat Titans
Punjab Kings
Toss
Narendra Modi Stadium
Ahmedabad

More Telugu News