వాలంటీర్లు పెన్షన్ ఇవ్వకూడదన్న ఈసీ ఆదేశాలను సవాల్ చేస్తూ పిటిషన్.. కొట్టేసిన ఏపీ హైకోర్టు
- పింఛన్ల పంపిణీలో వాలంటీర్లు పాల్గొనరాదని ఈసీ ఆదేశాలు
- ఈసీ ఆదేశాలను హైకోర్టులో సవాల్ చేసిన గుంటూరుకు చెందిన మహిళ
- ఈసీ ఆదేశాలను సమర్థించిన హైకోర్టు
ఈ పిటిషన్ ను హైకోర్టు డిస్మిస్ చేసింది. వాలంటీర్ల విషయంలో ఈసీ చర్యలను హైకోర్టు సమర్థించింది. పెన్షన్లు వేరే మార్గాల్లో అందించాలంటూ కలెక్టర్లకు సీఎస్ ఆదేశాలు జారీ చేశారని పిటిషనర్ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. వాదనలు విన్న హైకోర్టు పిటిషన్ ను కొట్టేస్తున్నట్టు తెలిపింది. మరోవైపు పింఛన్ దారులు సచివాలయాల వద్ద ఎండలో పడిగాపులు కాస్తున్నారు. తాగునీరు, నీడ లేక ఇబ్బంది పడుతున్నారు. రాష్ట్రంలోని పలు మండలాల్లో ఇంకా పింఛన్ పంపిణీ ప్రారంభం కాలేదు. పింఛన్లు రేపు ఇస్తామని పలు చోట్ల అధికారులు చెపుతున్నారు.