Dr Suneetha: ఆ సినిమా చివరి అరగంట చూడలేక కళ్లు మూసుకున్నాను... 'వివేకం' సినిమాపై సునీత స్పందన

Dr Suneetha talks about Vivekam movie
షార్ట్స్‌లో చూడండి
మాజీ ఎంపీ వివేకా హత్యోదంతం ఆధారంగా తెరకెక్కిన 'వివేకం' అనే చిత్రం ఇటీవల యూట్యూబ్ లో విడుదలైంది. టీమ్ ఎస్ క్యూబ్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రానికి మిలియన్లకొద్దీ వ్యూస్ వస్తున్నాయి. ఈ చిత్రంపై వివేకా కుమార్తె డాక్టర్ సునీతా రెడ్డి స్పందించారు. 

"అది సినిమా అనాలో, డాక్యుమెంటరీ అనాలో నాకు తెలియదు. ఎవరు తీశారో, ఎప్పుడు తీశారో గానీ... చాలా ధైర్యంగా తీశారు. అందులో చూపించిన వ్యక్తిగత అంశాల పట్ల కొన్ని భేదాభిప్రాయాలు ఉండొచ్చేమో కానీ... ఆ సినిమాలో చివరి అరగంట చూడ్డానికి నాకే భయం వేసింది. చూడలేక కళ్లు మూసుకున్నాను. వాస్తవంగా జరిగిన ఉదంతంతో పోల్చితే ఆ సినిమాలో చాలా లైట్ గా చూపించారు. రియాలిటీ ఇంకా చాలా ఘోరంగా ఉంటుంది. అది చూస్తే ప్రజలు ఎలా రిసీవ్ చేసుకుంటారేమో కానీ, నాకు మాత్రం చాలా బాధేసింది" అని వివరించారు.
Go Back to Shorts
Dr Suneetha
Vivekam
Movie
YS Vivekananda Reddy

More Telugu News