Mandali Buddaprasad: నేడు జనసేనలోకి మండలి బుద్ధప్రసాద్.. అవనిగడ్డ నుంచి బరిలోకి?

Mandali Buddaprasad Today Joins Janasena May Contest From Avanigadda
షార్ట్స్‌లో చూడండి
ఏపీ మాజీ డిప్యూటీ స్పీకర్, టీడీపీ సీనియర్ నేత మండలి బుద్ధప్రసాద్ నేడు జనసేన పార్టీలో చేరనున్నారు. పిఠాపురంలో పవన్ కల్యాణ్ సమక్షంలో ఆయన జనసేన కండువా కప్పుకోనున్నట్టు తెలుస్తోంది. బుద్ధప్రసాద్‌కు ఇప్పటికే అవనిగడ్డ టికెట్ ఖాయమైనట్టు తెలుస్తోంది. పొత్తులో భాగంగా అవనిగడ్డ స్థానం జనసేనకు కేటాయించారు. ఈ నేపథ్యంలో అక్కడి నుంచి బుద్ధ ప్రసాద్‌ను బరిలోకి దింపాలని జనసేన అధిష్ఠానం నిర్ణయించినట్టు తెలిసింది. 

1999, 2004, 2014 ఎన్నికల్లో ఇక్కడి నుంచి గెలిచిన ఆయనకు నియోజకవర్గంపై మంచి పట్టు ఉండడం కూడా ఇందుకు మరో కారణం. ఆయనకు టికెట్ ఇవ్వడం ద్వారా అవనిగడ్డను తన ఖాతాలో వేసుకోవాలని జనసేన భావిస్తోంది. ఇక, మచిలీపట్టణం లోక్‌సభ స్థానానికి కూటమి నుంచి బరిలోకి దిగిన వల్లభనేని బాలశౌరికి జనసేన టికెట్ కేటాయించడం వెనక మండలి బుద్ధప్రసాద్ కీలకంగా వ్యవహరించినట్టు తెలుస్తోంది.
Go Back to Shorts
Mandali Buddaprasad
Janasena
Avanigadda
Pawan Kalyan

More Telugu News