ఎక్కడ చూసినా అల్లు అర్జున్ మైనపు విగ్రహం ఫొటోలే!

Allu Arjun Madame Tussauds wax statue photos went viral
  • ప్రఖ్యాత మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో అల్లు అర్జున్ మైనపు విగ్రహం
  • నిన్న దుబాయ్ లో విగ్రహాన్ని ఆవిష్కరించిన బన్నీ
  • తన విగ్రహం పక్కనే నిల్చుని ఫొటోలకు పోజులు
టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరుదైన గౌరవం దక్కించుకున్న సంగతి తెలిసిందే. ప్రపంచ ప్రఖ్యాత మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో అల్లు అర్జున్ మైనపు విగ్రహాన్ని నిన్న ఆవిష్కరించారు. అల్లు అర్జున్ నిన్న దుబాయ్ లోని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో తన విగ్రహాన్ని ఆవిష్కరించి మురిసిపోయారు. తన విగ్రహం పక్కనే నిల్చుని ఫొటోలకు పోజులిచ్చారు. 

పుష్ప చిత్రంలోని ఐకానిక్ 'తగ్గేదే లే' పోజుతో ఉన్న బన్నీ మైనపు విగ్రహం రెడ్ జాకెట్, గ్రే ట్రౌజర్ లో ఒరిజినాలిటీకి బాగా దగ్గరగా కనిపిస్తుంది. సోషల్ మీడియాలో ఇప్పుడెక్కడ చూసినా ఇవే ఫొటోలు కనిపిస్తున్నాయి. తమ ఆరాధ్య హీరో అంతర్జాతీయ ఘనత అందుకోవడం పట్ల అల్లు అర్జున్ ఫ్యాన్స్ లో ఆనందం అంబరాన్నంటుతోంది.
Advertisement
Allu Arjun
Madame Tussaud's
Wax Statue
Dubai
Icon Star
Tollywood

More Telugu News