బీజేపీలో చేరిన ఝార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి వదిన
- బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో బీజేపీలో చేరిన వదిన సీతా సోరెన్
- పార్టీలో తనను ఒంటరి చేస్తున్నారని ఆవేదన
- మోదీ, అమిత్ షా, నడ్డా మీద నమ్మకంతో పార్టీలో చేరుతున్నట్లు వెల్లడి
పద్నాలుగేళ్లుగా తాను పార్టీ కోసం పని చేస్తున్నప్పటికీ తనకు గౌరవం దక్కలేదని ఆ లేఖలో పేర్కొన్నారు. జేఎంఎంలో తగిన గౌరవం దక్కనందుకే తాను ఆ పార్టీకి రాజీనామా చేయాల్సి వచ్చిందని వెల్లడించారు. ప్రధాని నరేంద్ర మోదీ, పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా, హోంమంత్రి అమిత్ షాల మీద ఉన్న నమ్మకంతో బీజేపీలో చేరుతున్నట్లు చెప్పారు. తన భర్త మరణం తర్వాత తనను, తన కుటుంబాన్ని అగౌరవపరిచే విధంగా వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. పార్టీ సభ్యులు, కుటుంబం తమను వేరు చేసే విధంగా వ్యవహరించడం తనను కలిచివేసిందని ఆవేదన వ్యక్తం చేశారు.
కాలంతో పాటు పరిస్ధితులు మారతాయని తాను సహనంతో ఉన్నప్పటికీ... తన భర్త ఆశయాలను ముందుకు తీసుకు వెళ్లడంలో పార్టీ చొరవ చూపడం లేదని ఆరోపించారు. కాగా, హేమంత్ సోరెన్ అన్న దుర్గా సోరెన్ భార్య సీతా సోరెన్. దుర్గా సోరెన్ 2009లో మృతి చెందారు.