రెండో పెళ్లిపై నిహారిక కొణిదెల ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

రెండో పెళ్లిపై నిహారిక కొణిదెల ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు

Niharika Konidela Interesting Comments on her Second Marriage
  • క‌చ్చితంగా రెండో పెళ్లి చేసుకుంటాన‌న్న మెగా డాట‌ర్‌
  • రాసిడ‌న్ బ్లూ ప‌బ్ కేసులో త‌న‌ను అన్యాయంగా ఇరికించార‌న్న‌ నిహారిక‌
  • బిల్లు క‌ట్టి బ‌య‌ట‌కు వ‌స్తుంటే పోలీసులు అరెస్ట్ చేసిన‌ట్లు వెల్ల‌డి
మెగా డాట‌ర్ నిహారిక కొణిదెల తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో మాట్లాడుతూ, త‌న రెండో పెళ్లిపై ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసింది. "నాకు పిల్ల‌లంటే చాలా ఇష్టం. పిల్ల‌లు కావాలంటే క‌చ్చితంగా పెళ్లి చేసుకోవాల్సిందే. ఒక రిలేష‌న్‌షిప్ వ‌ర్కౌట్ కాలేదంటే చాలా కార‌ణాలు ఉంటాయి. అలా ఎన్నో కార‌ణాల‌తోనే నా పెళ్లి కూడా వ‌ర్కౌట్ కాలేదు. అలా మ‌ళ్లీ ఒక‌రిపై ప్రేమ పుట్ట‌ద‌నుకుంటే మూర్ఖ‌త్వ‌మే అవుతుంది. త్వ‌ర‌లో అని చెప్ప‌లేను కానీ పెళ్ల‌యితే చేసుకుంటాను" అని చెప్పుకొచ్చింది. 

రాడిస‌న్ బ్లూ ప‌బ్ సంఘ‌ట‌న‌పై..
"రాసిడ‌న్ బ్లూ ప‌బ్ కేసులో న‌న్ను అన్యాయంగా ఇరికించారు. నేను ప‌బ్బుల‌కు, పార్టీల‌కు చాలా త‌క్కువ‌గా వెళ్తుంటాను. ఆరోజు నేను అక్క‌డ మా స్కూల్ ఫ్రెండ్స్‌ను క‌లిశాను. ఆరు నెల‌ల త‌ర్వాత వారిని క‌లిసి కబుర్లు చెప్పుకున్నాం. అయితే ఆ సౌండ్ మాకు ఇబ్బందిగా అనిపించ‌డంతో ఇంటికి వెళ్లిపోదామ‌నుకున్నాను. బిల్లు క‌ట్టి బ‌య‌ట‌కు వ‌చ్చే స‌మ‌యానికి పోలీసులు వ‌చ్చారు. మ‌మ్మ‌ల్ని స్టేష‌న్‌కు తీసుకెళ్లారు. మీడియాలో ఎందుకింత ర‌చ్చ చేశారో అస్స‌లు అర్థం కాలేదు. కానీ చాలా బాధేసింది. త‌ర్వాత అక్క‌డెవ‌రో డ్ర‌గ్స్ తీసుకున్నార‌ని తెలిసింది. నేను త‌ప్పుడు ప్ర‌దేశంలో ఉన్నాన‌ని ఆల‌స్యంగా తెలుసుకున్నాను" అని నిహారిక చెప్పింది.
Advertisement
Niharika Konidela
Marriage
Tollywood

More Telugu News