కాంగ్రెస్‌లో చేరుతున్నారంటూ జోరుగా ప్రచారం... స్పందించిన కడియం శ్రీహరి
- కడియం శ్రీహరికి కాంగ్రెస్ కీలక పదవి ఆఫర్ చేసిందంటూ ప్రచారం
- తాను పార్టీ మారుతున్నట్లుగా జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదన్న కడియం శ్రీహరి
- తనపై కొంతమంది కావాలని దుష్ప్రచారం చేస్తున్నారని ఆవేదన
బీఆర్ఎస్ పార్టీని ఎవరూ వీడటం లేదని... పార్టీని... పార్టీలోని ప్రతి కార్యకర్తను కాపాడుకుంటామన్నారు. ఇప్పటికే ఉమ్మడి వరంగల్ జిల్లాలోని వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేశ్ బీజేపీలోకి వెళుతున్నారంటూ ప్రచారం సాగింది. ఆయన అనూహ్యంగా హైదరాబాద్‌లోని కేసీఆర్ నివాసంలో ప్రత్యక్షమయ్యారు. వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ సమీక్ష సమావేశానికి హాజరయ్యారు.