కర్నూలులో దారుణం.. కూతురు గొంతుకోసి చంపేసిన తండ్రి!
- కోసిగి మండలం జంపాపురంలో ఘటన
- మూడేళ్ల చిన్నారి గొంతు కోసిన తండ్రి శాంతి కుమార్
- మద్యం మత్తులో దారుణానికి పాల్పడిన నిందితుడు
- భార్య ఫిర్యాదుతో శాంతి కుమార్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు
ఈ క్రమంలో ఇవాళ ఉదయం చిన్నారిని గొంతు కోసి చంపేశాడు. నిద్రలేచి చూసేసరికి కూతురు రక్తపుమడుగులో పడి ఉండడంతో తల్లి సంపూర్ణ పోలీసులకు సమాచారం అందించింది. దీంతో ఘటనాస్థలికి వచ్చిన పోలీసులు శాంతి కుమార్ ను అదుపులోకి తీసుకున్నారు. కాగా, నిందితుడి సొంత ఊరు మంత్రాలయం మండలం కగ్గళ్లు గ్రామం అని తెలిసింది. జంపాపురంలో ఇల్లరికం అల్లుడిగా వెళ్లాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టించింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.