బెంగళూరులో మహిళ దారుణహత్య.. నగ్నంగా మృతదేహం

Woman dead body found in a house in Bengaluru
  • బెంగళూరులో శివారులోని చందాపుర హెడ్‌మాస్టర్ లేఔట్‌లో ఘటన
  • మృతదేహం చుట్టూ మద్యం సీసాలు, సిగరెట్లు, భోజనం ప్యాకెట్లు
  • ఐదు రోజులుగా తెరుచుకోని ఇంటి తలుపులు
  • స్థానికుల ఫిర్యాదుతో ఘోరం వెలుగులోకి
కర్ణాటక రాజధాని బెంగళూరు శివారులో ఓ యువతి దారుణహత్యకు గురైంది. ఐదు రోజుల క్రితం ఈ హత్య జరిగినట్టు పోలీసులు భావిస్తున్నారు. పోలీసుల కథనం ప్రకారం.. ఒడిశాకు చెందిన సపన్‌కుమార్ నగర శివారులోని చందాపుర హెడ్‌మాస్టర్ లేఔట్‌లో నాలుగో అంతస్తులో నివసిస్తున్నాడు. 28 ఏళ్ల మహిళ ఆయనతో కలిసి కొంతకాలంగా అక్కడే ఉంటోంది. 

హత్యకు ముందు వారిద్దరూ కలిసి మద్యం తాగినట్టు ఇంట్లోని పరిస్థితులను బట్టి తెలుస్తోంది. మృతదేహం చుట్టుపక్కల మద్యం సీసాలు, సిగరెట్లు, భోజనం ప్యాకెట్లు పడివున్నాయి. ఐదు రోజుల నుంచి ఇంటి తలుపులు తెరుచుకోకపోవడం, ఇంటి నుంచి దుర్వాసన వస్తుండడంతో అనుమానించిన స్థానికులు పోలీసులకు ఫిర్యాదుచేశారు. 

వారొచ్చి తలుపులు పగలగొట్టి లోపలికి వెళ్లి చూడగా హత్య విషయం వెలుగులోకి వచ్చింది. ఇంట్లో నగ్నంగా పడివున్న మహిళ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఘటన తర్వాతి నుంచి సపన్‌కుమార్ కనిపించడం లేదు. అతడి ఫోన్ కూడా స్విచ్చాఫ్‌లో ఉంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు.
Go Back to Shorts
Bengaluru
Karnataka
Crime News
Odisha

More Telugu News