బీజేపీ నేతలతో పవన్ కల్యాణ్ కీలక సమావేశం
- విజయవాడలో సమావేశం
- బీజేపీ తరఫున కేంద్రమంత్రి షెకావత్, బైజయంత్ పండా హాజరు
- పోటీ చేసే స్థానాలపై పవన్ తో చర్చలు
పొత్తు కుదిరిన నేపథ్యంలో, పోటీ చేసే స్థానాలపై పవన్, షెకావత్, పురందేశ్వరి చర్చలు జరిపారు. లోక్ సభ, అసెంబ్లీ అభ్యర్థుల ఎంపికపై ఇరుపార్టీల నేతలు సమాలోచనలు చేశారు. ఏపీలో మొత్తం 175 అసెంబ్లీ స్థానాలు, 25 లోక్ సభ స్థానాలు ఉండగా... బీజేపీ-జనసేనకు 30 అసెంబ్లీ స్థానాలు, 8 ఎంపీ స్థానాలు కేటాయించిన సంగతి తెలిసిందే.